రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా - కేటీఆర్ 1 d ago
TG: రైతు భరోసా కింద కోతలు విధించి కొందరికే ఇస్తామని మేము చెప్పలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు భరోసా మీద మా ప్రభుత్వం విధివిధానాల పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రైతు భరోసా మీద ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పుడు..ఈ చర్చ ఎందుకు అని కేటీఆర్ ప్రశ్నించారు. కొండారెడ్డిపల్లి పోదామా కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా..ఏ ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అని కేటీఆర్ సవాల్ చేసారు.